సల్మాన్ ఖాన్ తో సినిమా చెయ్యటం లేదు..నిర్మాత అధికార ప్రకటన
on Mar 11, 2024
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సోషల్ మీడియాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మార్కెట్ లో ఆయన సినిమా ఉన్నా లేకపోయినా సల్లు భాయ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంటుంది. హిందీ చిత్ర సీమలో మూడు దశాబ్దాలకి పై నుంచే ఎన్నో అధ్భుతమైన సినిమాల్లో నటిస్తు వస్తున్నాడు.ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.
సల్మాన్ కొన్నాళ్ల క్రితం విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ది బుల్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఆ మూవీని హోల్డ్‌లో పెట్టి ఏ ఆర్ మురుగదాస్‌తో జతకట్టాడు.ఈ విషయం అన్ని మీడియా చానల్స్ లో వచ్చింది. భారీ హిట్ చిత్రాల నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఆ మూవీ కిక్ 2 అనే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో నడియావాలా ప్రొడక్షన్ రంగంలోకి దిగింది. సల్మాన్ ఖాన్ తో మేము నిర్మించబోయే సినిమా కిక్ 2 కాదని వివరణ ఇచ్చింది.మా సినిమా టైటిల్ అది కాదని అసలు కిక్ సినిమా కి మాకు సంబంధం కూడా లేదని చెప్పింది. మురుగదాస్ మా దర్శకుడని కన్ఫార్మ్ చేసింది
తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన కిక్ నే సల్మాన్ హిందీలో అదే పేరుతో తెరకెక్కించాడు. బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. మురుగుదాస్ గతంలో గజినీ హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహించాడు.ఇక సల్లు భాయ్ ,మురుగదాస్ కాంబో కి ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. సోషల్ మెసేజస్ తో కూడిన సినిమాలని తెరక్కించడం లో దిట్ట అయిన మురుగుదాస్ సల్మాన్ తో కూడా అదే టైప్ ఆఫ్ సినిమా చేస్తాడేమో చూడాలి.
Also Read